అఫ్ఘాన్ మహిళా కార్యకర్త ఫ్రెష్తా కొహిస్తానీపై కాల్పులు

ABN , First Publish Date - 2020-12-25T11:41:35+05:30 IST

అఫ్ఘనిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త ఫ్రెష్తా కోహిస్తానీని కాల్చి చంపారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది....

అఫ్ఘాన్ మహిళా కార్యకర్త ఫ్రెష్తా కొహిస్తానీపై కాల్పులు

కాబూల్ (అఫ్ఘనిస్తాన్) : అఫ్ఘనిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త ఫ్రెష్తా కోహిస్తానీని కాల్చి చంపారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. అఫ్ఘనిస్తాన్ దేశంలోని ఈశాన్య కపిసా ప్రావిన్సులో మానవ హక్కుల కార్యకర్త ఫ్రెష్తా కోహిస్తానీ మోటారుసైకిలుపై వెళుతుండగా గుర్తుతెలియని ముష్కరులు వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  ఫ్రెష్తా కోహిస్తానీ మరణించారు.  ఫ్రెష్తా కోహిస్తానీ సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హత్యపై అఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్సు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అఫ్ఘనిస్తాన్ దేశంలో ఈ వారంలో పలువురి హత్యలు జరిగాయి. మంగళవారం ఘజ్నీ ప్రావిన్సులో జర్నలిస్టు యూనియన్ అధినేత రహమతుల్లా నిక్జాద్ హత్యకు గురయ్యారు. అఫ్ఘనిస్తాన్ వాచ్ డాగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఫోరం అధినేత యూసుఫ్ రషీద్ ను ముష్కరులు కాల్చి చంపారు.అఫ్ఘనిస్థాన్ దేశంలో హత్యలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

Updated Date - 2020-12-25T11:41:35+05:30 IST