హైరిస్క్‌ వారికి ఆపాదమస్తకం రక్ష

ABN , First Publish Date - 2020-04-05T07:48:24+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సిబ్బంది నుంచి రక్షణ దుస్తుల డిమాండ్‌ పెరుగుతోంది. అయితే.. వైద్య నిపుణులు, నర్సులు, సిబ్బందిలో ఎవరెవరికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించే దుస్తులు అవసరం?

హైరిస్క్‌ వారికి ఆపాదమస్తకం రక్ష

భద్రత పరికరాలపై కేంద్రం మార్గదర్శకాలు


కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సిబ్బంది నుంచి రక్షణ దుస్తుల డిమాండ్‌ పెరుగుతోంది. అయితే.. వైద్య నిపుణులు, నర్సులు, సిబ్బందిలో ఎవరెవరికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించే దుస్తులు అవసరం? ఎవరికి మాస్కులు సరిపోతాయి? అనే అంశంపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. భద్రత పరికరాల్లో గ్లవ్స్‌, కవరాల్‌/గౌన్‌, కళ్లజోడు, మాస్కులు, షూ కవర్‌, ఫేస్‌ షీల్డ్‌ ఉండాలని పేర్కొంది. కోవిడ్‌-19 కేసులను పర్యవేక్షించే వైద్య సిబ్బందిని మూడు కేటగిరీలు (లో రిస్క్‌, మోడరేట్‌, హైరి్‌స్క)గా విభజించింది.


వీరంతా హైరిస్క్‌ కేటగిరీలో..

కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులు; మృతదేహాలను ప్యాక్‌ చేసేవారు, పోస్టుమార్టం, అంబులెన్స్‌ సిబ్బంది, ల్యాబ్‌లలో నమూనాలు సేకరించేవారు, పరీక్షలు జరిపేవారు హైరిస్క్‌ కేటగిరీలో ఉంటారు. వీరికి ఆపాదమస్తకం ప్రొటెక్షన్‌ అవసరం.


మోడరేట్‌ రిస్క్‌

ఐసోలేషన్‌ వార్డుల్లో వివరాలు నమోదు చేసే సిబ్బంది/క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌, మెయింటెనెన్స్‌ సిబ్బంది, పేషెంట్లను స్ర్కీనింగ్‌ చేసేవారు, రిసెప్షన్‌లో పనిచేసేవారు, ఆస్పత్రుల్లోని లాండ్రీ సిబ్బంది మోడరేట్‌ రిస్క్‌ కేటగిరీలో ఉంటారు. వీరు ట్రిపుల్‌ లేయర్‌/ఎన్‌-95 మాస్క్‌తోపాటు.. గ్లవ్స్‌ను ధరించాలి. మిగతా సిబ్బంది లో-రిస్క్‌ కేటగిరీలో ఉంటారు. వీరు ట్రిపుల్‌ లేయర్‌/ఎన్‌-95 మాస్క్‌ను ధరించాలి.


ప్రమాణాలివే..

గ్లవ్స్‌: నైట్రైల్‌, నాన్‌-స్టెరైల్‌, పౌడర్‌ఫ్రీ గ్లౌజులు ఉండాలి. ఈయూ లేదా ఏఎన్‌ఎ్‌సఐ/సీ లేదా ఏఎ్‌సటీఎం ప్రమాణాలను పాటించాలి


కవరాల్‌/గౌను: ఐఎ్‌సవో-16603 ప్రమాణాలతో పారదర్శకంగా ఉండాలి. వాడి పారేసేదై ఉండాలి.


కళ్లజోడు: జీరో పవర్‌తో తేమ నిరోధకంగా ఉండాలి. గ్లౌస్‌ మాదిరి ప్రమాణాలుండాలి


ఎన్‌-95/ట్రిపుల్‌ లేయర్‌ మాస్క్‌: ఐఎ్‌సఐ ప్రమాణాలు తప్పనిసరి


షూ కవర్‌: కవర్‌ఆల్‌ తయారీకి వినియోగించిన పదార్థాన్నే వాడాలి. పిక్కల దాకా కవర్‌ చేయాలి


ఫేస్‌ షీల్డ్‌: నాణ్యమైన ప్లాస్టిక్‌తో తయారై ఉండాలి. తేమను నిరోధించగలగాలి. ఈయూ, ఏఎన్‌ఎ్‌సఐ ప్రమాణాలుండాలి


- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-04-05T07:48:24+05:30 IST