అత్యాధునిక కరోనా పరీక్షా యంత్రం
ABN , First Publish Date - 2020-06-22T07:40:41+05:30 IST
బిహార్ రాజధాని పట్నాలోని రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఆర్‌ఎంఆర్‌ఐఎంఎ్‌స)లో అత్యాధునిక కరోనా పరీక్షా యంత్రాన్ని ఏర్పాటుచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి...

- పట్నాలో ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్
- రోజుకు 1500 కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం
పట్నా(బిహార్), జూన్ 21 : బిహార్ రాజధాని పట్నాలోని రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఆర్‌ఎంఆర్‌ఐఎంఎ్‌స)లో అత్యాధునిక కరోనా పరీక్షా యంత్రాన్ని ఏర్పాటుచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. ‘సీఓబీఏఎస్ 6800’ అనే పేరు కలిగిన ఈ యంత్రానికి రోజుకు 1500 కొవిడ్- 19 పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు.
భారీసంఖ్యలో వలస కార్మికులు బిహార్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసేందుకు ‘సీఓబీఏఎస్ 6800’ దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్‌ఎంఆర్‌ఐఎంఎ్‌సలో 25 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో పనిచేస్తూ నాలుగు ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాల ద్వారా రోజుకు 2వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త యంత్రం ఏర్పాటుతో అదనంగా మరో 1500 పరీక్షలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.