టెన్త్ తర్వాత సీఏ ఫౌండేషన్‌లో ప్రవేశం
ABN , First Publish Date - 2020-10-21T08:45:46+05:30 IST
పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా సీఏ ఫౌండేషన్ కోర్సులో ప్రొవిజనల్ అడ్మిషన్(తాత్కాలిక ప్రవేశం) పొందే సౌకర్యాన్ని..

న్యూఢిల్లీ, అక్టోబరు 20: పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా సీఏ ఫౌండేషన్ కోర్సులో ప్రొవిజనల్ అడ్మిషన్(తాత్కాలిక ప్రవేశం) పొందే సౌకర్యాన్ని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కల్పించింది. అయితే, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన తర్వాతే ఈ ప్రవేశాన్ని క్రమబద్ధీకరించనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం 6 నెలల ముందుగానే సీఏ కోర్సును పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.