లాక్‌డౌన్ లాంటి క్లిష్ట సమయంలో నెలపాటు అడవిలో దాక్కున్న మహిళలు... ఎందుకంటే...
ABN , First Publish Date - 2020-06-12T02:18:39+05:30 IST
దేశమంతా కరోనాతో వణికిపోతూ లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కర్నాటకలోని ఓ ఫ్యాక్టరీలో ఘోరం జరిగిపోయింది.

న్యూఢిల్లీ : దేశమంతా కరోనాతో వణికిపోతూ లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కర్నాటకలోని ఓ ఫ్యాక్టరీలో ఘోరం జరిగిపోయింది. అందులో పని చేస్తున్న ఓ ఆదివాసీ మహిళపై ఆ ఫ్యాక్టరీలో గ్యాంగ్ రేప్ జరిగింది. దీంతో ఆ మహిళలతో పాటు మరో మహిళ కూడా తమ కుమార్తెలతో కలిసి (మైనర్) ఓ నెల పాటు కర్నాటకలోని ఓ అడవిలో దాక్కుండిపోయారు. దీనిపై అడగ్గా... తమని సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళలు కూడా జార్ఖండ్‌లోని డుమ్కా ప్రాంతానికి చెందిన వారు. తరువాత వారిని స్వచ్ఛంద సంస్థలు రక్షించాయి.