లాక్‌డౌన్ పొడగింపు అవకాశాలే అధికం :అధీర్ రంజన్

ABN , First Publish Date - 2020-04-08T23:53:21+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటం చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి

లాక్‌డౌన్ పొడగింపు అవకాశాలే అధికం :అధీర్ రంజన్

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటం చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి విస్తరణ, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ తరపున అధీర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మోదీ ముందు కొన్ని సూచనలు ఉంచినట్లు ఆయన తెలిపారు. 21 రోజుల లాక్‌డౌన్ నుంచి రైతులకు మినహాయింపు ఇవ్వాలని తమ పార్టీ పక్షాన సూచన చేశామని, అలాగే క్రిమి సంహారకాలపై ఉన్న అన్ని పన్నులనూ ఎత్తేయాలని సూచించినట్లు అధీర్ రంజన్ తెలిపారు. 

Updated Date - 2020-04-08T23:53:21+05:30 IST