ప్రతిపక్షాలతో టచ్‌లో ఉండండి : నితీశ్‌కు అధీర్ సలహా
ABN , First Publish Date - 2020-12-27T20:40:01+05:30 IST
లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌందరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓ సలహా ఇచ్చారు. అరుణాచల్

న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌందరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓ సలహా ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎదురైన ఝలక్ బిహార్‌లో ఎదురు కాకుండా ఉండాలంటే నిత్యమూ ప్రతిపక్ష పార్టీలతో టచ్‌లో ఉండాలని సలమా ఇచ్చారు. ‘అరుణాచల్ ప్రదేశ్ లాంటి సిండ్రోమ్‌కు విరుగుడు ఇదే’ అని అధీర్ స్పష్టం చేశారు. ‘‘నితీశ్ కుమార్ గారూ... బీజేపీ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈశాన్య ప్రాంతంలో ఉన్న వేటగాళ్ల మాదిరిగా వేటలో బీజేపీ వారు చాలా నైపుణ్యం కలిగి ఉండారు. జాగ్రత్త...’’ అంటూ ట్విట్టర్ వేదికగా అధీర్ సూచించారు. బీజేపీ వాళ్లు ఆత్మనిర్భర్ అని కాకుండా ఆత్మ నిర్వర్ ను ఫాలో అవుతుంటారని, బీజేపీ ఒక్కటే ఎదిగేలా చూస్తారని, ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యం కావాలని ఆశిస్తారని అధీర్ ఎద్దేవా చేశారు.