జైలులో ఫోన్‌ కోసం సంజన వీరంగం

ABN , First Publish Date - 2020-10-13T08:20:20+05:30 IST

డ్రగ్‌ మాఫియా కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో గడుపుతున్న నటి సంజన గల్రాని సోమవారం ఫోన్‌ కోసం వీరంగం చేశారు...

జైలులో ఫోన్‌ కోసం సంజన వీరంగం

  • వెన్ను నొప్పి అంటూ కోర్టులో రాగిణి పిటిషన్‌

బెంగళూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): డ్రగ్‌ మాఫియా కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో గడుపుతున్న నటి సంజన గల్రాని సోమవారం ఫోన్‌ కోసం వీరంగం చేశారు.  ఆమెతోపాటు డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన రాగిణితోనూ వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. తాను వెన్నునొప్పి, అనారోగ్యంతో బాధపడుతున్నానని తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు అనుమతి ఇవ్వాలం టూ నటి రాగిణి ద్వివేది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  

Updated Date - 2020-10-13T08:20:20+05:30 IST