నిరాశ చెందా.. కానీ, ఆరోగ్యం ముఖ్యం: కమల్
ABN , First Publish Date - 2020-12-30T08:12:18+05:30 IST
రజినీ రాజకీయాల్లోకి రావడం కన్నా ఆయన ఆరోగ్యంగా ఉండడమే తనకెంతో ముఖ్యమని సీనియర్ నటుడు, ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత కమల్‌హాసన్ ప్రకటించారు.

రజినీ రాజకీయాల్లోకి రావడం కన్నా ఆయన ఆరోగ్యంగా ఉండడమే తనకెంతో ముఖ్యమని సీనియర్ నటుడు, ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత కమల్‌హాసన్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రాబోనంటూ రజినీ ప్రకటన చేసిన కొద్దిసేపటికే కమల్ ఓ బహిరంగసభలో స్పందించారు. రజినీ ప్రకటనతో తాను నిరాశ చెందానని, అయితే రాజకీయాల్లోకి రావడం కన్నా ఆయన ఆరోగ్యంగా ఉండడమే తనకెంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రచారం ముగియగానే తాను రజినీని కలుస్తానని ప్రకటించారు. రజినీ తమలాంటి మంచి పార్టీలకు మద్దతు ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత ఇలగణేశన్ విజ్ఞప్తి చేశారు.
ఆయన ఇష్టం: రజినీ అన్నయ్య
పార్టీ ప్రారంభించే విషయంలో తన తమ్ముడు రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం.. ఆయన ఇష్టానికే వదిలివేయాలని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరైనదేనని రజినీ అన్నయ్య సత్యనారాయణరావు బెంగళూరులో అన్నారు. రజినీ మైండ్ సెట్‌ను ఎవరూ మార్చలేరని తెలిపారు.