ప్రభుత్వం తొందరగా ఓ పరిష్కారం చూపాలి : ధర్మేంద్ర ట్వీట్

ABN , First Publish Date - 2020-12-11T19:02:31+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనపై సినీ నటుడు ధర్మేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు

ప్రభుత్వం తొందరగా ఓ పరిష్కారం చూపాలి : ధర్మేంద్ర ట్వీట్

ముంబై : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనపై సినీ నటుడు ధర్మేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నా రైతు సోదరులు పడుతున్న కష్టాలను చూసి చాలా బాధపడుతున్నా. ప్రభుత్వం తొందరగా ఏదైనా ఓ పరిష్కారం చూపాలి. ఢిల్లీ కరోనా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి చూసి చాలా బాధేస్తోంది.’’ అని నటుడు ధర్మేంద్ర ట్వీట్ చేశారు.

Updated Date - 2020-12-11T19:02:31+05:30 IST