ఆచార్య దేవోభవ

ABN , First Publish Date - 2020-10-27T06:49:01+05:30 IST

ఉపాధ్యాయ శక్తిపై ప్రజల్లో అత్యంత సాను కూల అభిప్రాయం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరోస్థానంలో నిలి చింది.

ఆచార్య దేవోభవ

 టీచర్లపై సానుకూల దేశాల్లో భారత్‌కు 6వ స్థానం

లండన్‌, అక్టోబరు 26: ఉపాధ్యాయ శక్తిపై ప్రజల్లో అత్యంత సాను కూల అభిప్రాయం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరోస్థానంలో నిలి చింది. బ్రిటన్‌కు చెందిన ‘వార్కే ఫౌండేషన్‌’ 35 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలతో నివేదికను ‘రీడింగ్‌ బిట్వీన్‌ ది లైన్స్‌ : వాట్‌ ది వరల్డ్‌ రియల్లీ థింక్స్‌ ఆఫ్‌ టీచర్స్‌’ శీర్షికన గతవారం విడుదల చేసింది. తొలి 5 స్థానాల్లో చైనా, ఘనా, సింగపూర్‌, కెనడా, మలేషియా ఉన్నాయి.


‘విశ్వస నీయత’, ‘విద్యార్థులకు స్ఫూర్తితత్వం’, ‘బాధ్యతాయుత ప్రవర్తన’, ‘విష య పరిజ్ఞానాన్ని అందించగల మేఽధాశక్తి’ అంశాలు ఉపాధ్యాయుల్లో ఉన్నాయా? లేదా? అనే ప్రశ్నలకు ఒక్కో దేశంలో 1000 మంది నుంచి సేకరించిన సమాధానాల విశ్లేషణ ఆధారంగా నివేదికను రూపొందిం చారు. విద్యారంగానికి ఘనా దేశం 22.1ు, భారత్‌ 14ు, ఇటలీ 8.1ు బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు సర్వేలో తేలింది.


Updated Date - 2020-10-27T06:49:01+05:30 IST