ఏబీఎన్ స్పీడ్ 16 న్యూస్ @ 4PM

ABN , First Publish Date - 2020-12-27T22:23:54+05:30 IST

కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితులు అనేక పాఠాలు నేర్పించాయని ఆయన మన్​కీ బాత్‌లో చెప్పారు.

ఏబీఎన్ స్పీడ్ 16 న్యూస్ @ 4PM

1. మనసులో మాట

కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ప్రధాని  మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితులు అనేక పాఠాలు  నేర్పించాయని ఆయన  మన్​కీ బాత్‌లో చెప్పారు.  అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు కేంద్ర మంత్రి  ధర్మేంద్ర  ప్రదాన్  భువనేశ్వర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.


2. టార్గెట్ 2021

అసోం కేంద్ర హోం మంత్రి అమిత్​  షా  గువాహటిలోని  కామాఖ్యా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు.  ఆయన వెంట ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్, ఆరోగ్య శాఖ మంత్రి   హిమంత బిశ్వ శర్మలున్నారు.  2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలే  టార్గెట్‌గా ..   షా పర్యటన కొనసాగుతోంది.


3. ఎలక్షన్ టైమ్

తమిళనాడు  సీఎం   పళనిస్వామి ఇటీవల రైతు వేషధారణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  తుపాను కారణంగా నీట మునిగిన ప్రాంతాలను సందర్శించే సమయంలో దోతీ మడిచి, బురద పొలాల్లోకి దిగి రైతులతో నేరుగా మాట్లాడారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానన్నారు.  ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు  ఎన్నికల్లో  ఎంత వరకు ప్రభావం చూపిస్తాయో  మరి.


4. బాధ్యులపై చర్యలు తప్పవు

ఏపీలో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో  ఏపీ సర్కారు హడావుడిగా విచారణ చేపట్టింది.  . సీసీ ఫుటేజీ సహాయంతో ఆధారాలు సేకరిస్తోంది.  ఇక ఈ ఘటనపై  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. . బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీనిపై గతంలోనే ఆమె  ట్వీట్‌ చేయడంతో పాటు.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కూడా స్వయంగా మాట్లాడారు.


5. సింగిల్ ఎజెండా

ఢిల్లీ - హరియాణా సరిద్దుల్లో  రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. టిక్రీలో  మహిళలు కూడా   నిరసనల్లో పాల్గొన్నారు. ఎముకలు కొరికే చలిలో.. సింగిల్‌ అజెండాతో.. రైతులు  చేపట్టిన ఆందోళనలు నెలరోజులు దాటాయి.    ఇక సరిహద్దుల్లో పోలీసు బలగాలు కూడా   భారీగా మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా.. వారు పహారా కాస్తున్నారు.


6. ఉల్లి పంటతో నిరసన

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు వినూత్నంగా మారాయి. కొందరు  రైతులు నిరంకారీ మైదానంలో ఉల్లి సాగు చేస్తూ తమ నిరసన  తెలిపారు. వీటిని తమ రోజువారీ వంటల్లో ఉపయోగిస్తామని వారు  చెప్పారు. . మైదానంలో మరిన్ని పంటలు పండిస్తామన్నారు.  నయా  సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయంటూ వారు   స్పష్టం చేశారు.


7. స్ట్రెయిన్‌ను అడ్డుకోవడం ఎలా?

కొత్తరకం కరోనా వైరస్ భయాల తో  నేషనల్ టాస్క్​ఫోర్స్ కీలక సమావేశం నిర్వహించింది.  ఇందులో  స్ట్రెయిన్ వివరాలు, వ్యాప్తిని అడ్డుకోవడం వంటి విషయాలపై చర్చించింది. మరోవైపు, బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చిన 50 మంది నమూనాలను పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ  తెలిపింది. 


8. మరో 279 మంది మృతి

దేశవ్యాప్తంగా కొత్తగా 18,732 మందికి కరోనా సోకినట్టు  కేంద్ర  వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 279 మంది వైరస్​తో  చనిపోయారు.   దీంతో  మృతుల సంఖ్య లక్షా 47వేల 622కు చేరింది. దేశవ్యాప్తంగా  నిన్న  మరో  9లక్షల 43వేల మందికి  వైరస్‌ టెస్ట్‌లు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 


9. భవిష్యత్తు ఇంకా ప్రమాదకరం

భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటి మహమ్మారులను ఎదుర్కోవాల్సి రావొచ్చని WHO  చీఫ్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. 'అంటువ్యాధుల సన్నద్ధత' అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా  ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి లోపిస్తే ప్రమాదాలు తప్పవని అన్నారు. భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.. 


10. జనవరి నుంచే..

తెలంగాణలో ఈ సారి  పేద మహిళలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల తయారీని జనవరిలోనే ప్రారంభించాలని సర్కారు   నిర్ణయించింది. పండుగకు నెల రోజుల ముందే  చీరలను పంపిణీకి సిద్ధం చేయాలంటూ  ఆదేశించింది.  ఈసారి కూడా  317 కోట్లతో కోటి చీరలు తయారు  చేసేందుకు ప్రకాళికలు రూపొందిస్తున్నామని  రాష్ట్ర చేనేత, జౌళి శాఖ తెలిపింది


11. చలి చంపుతోంది.. లిక్కర్‌కి నో

ప్రస్తుత పరిస్థితుల్లో మద్యపానానికి దూరంగా ఉండటమే మేలు అని  భారత వాతావరణ శాఖ చెబుతోంది .  తాగితే  శరీర ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయంటూ అధికారులు  హెచ్చరిస్తున్నారు.  ముఖ్యంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత  ఎక్కువగా  ఉంది కాబట్టి.. ఇంట్లో లేదా  న్యూ ఇయర్  సెలబ్రేషన్స్‌లో  మద్యానికి దూరంగా ఉండటమే  మంచిదని ఐఎండీ చెబుతోంది. 


12. హ్యాపీ బర్త్ డే

బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ తన 55వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల   మధ్య జరుపుకున్నారు మధ్యప్రదేశ్‌లోని పాన్వెల్‌ ఫామ్‌ హౌస్‌లో  గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకున్నారు.  అందరూ కూడా కోవిడ్‌ నింబంధనలు పాటించినట్లు సల్మాన్‌ చెప్పారు. మీడియా ప్రతినిథుల మధ్య ఆయన కేక్‌ కట్‌ చేశారు. 


13. ఫారెస్ట్‌లో ఫ్యామిలీతో..

బాలీవుడ్‌ నటుడు  అమీర్‌ఖాన్‌  ఘీర్‌ పారెస్ట్‌లో ఎంజాయ్‌ చేశారు.  గుజరాత్‌ జునాఘడ్‌లోని ఈ ఫారెస్ట్‌కు  తన ఫ్యామిలీతో సహా వెళ్లారు.  అందరూ కోవిడ్‌ నిబంధనలు పాటించారు. ఘీర్‌ ఫారెస్ట్‌లో జంతువులను చూసేందుకు వెళ్గడం   చాలా థ్రిల్లింగా ఉందని అమీర్‌ చెప్పారు.


14. ఐస్ హాకీ

హిమాచల్‌ ప్రదేశ్‌లో   నేషనల్‌ అండర్ -20 హాకీ టోర్నమెంట్‌    ఉత్సాహంగా జరిగింది. లాహౌల్‌-  స్పిటిలో ని ట్రైనింగ్‌ క్యాంప్‌  ఆధ్వర్యంలో ఈ  టోర్నమెంట్‌   నిర్వహించారు. పార్టిసిపెంట్స్‌ ఐస్‌  హాకీలో  ఉత్సాహంగా  పాల్గొన్నారు. గెలవాలన్న తపన కంటే కూడా... ఐస్‌లో  హాకీ ఆడటం ఆనందంగా ఉందని క్రీడాకారులంటున్నారు


15. చలి-పులి

పొగ మంచుతో  లుథియానా  వాసులు అల్లాడిపోతున్నారు.   బారెడు పొద్దెక్కినా..  టైట్ల వెలుగులోనే  వాహనాలు   వెళ్ళాల్సిన పరిస్థితి .  మరో వైపు ప్రజలు శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. 


16. ఫోజు అదిరింది..

మాళవిక హాట్​ ఫోజులకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు.  1999 జనవరి 26న ముంబయిలో పుట్టిన మాళవిక  సినిమాలకు రాకముందు మోడల్​గా  కొన్ని యాడ్స్​లో నటించింది.  2018లో  నేల టిక్కెట్టు  సినిమా ద్వారా  టాలీవుడ్‌కు పరిచయం అయింది. లా చదవాలనే కోరిక ఉందని.. కాని  ఈ రంగంలోకి వచ్చానంటూ  సెల్ఫీ దిగుతూ  ముద్దుగుమ్మ చెప్పే  ముచ్చట్లు  కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

Updated Date - 2020-12-27T22:23:54+05:30 IST