క్షణాల్లో అమిత్‌షాకు కౌంటర్ ఇచ్చిన తృణమూల్
ABN , First Publish Date - 2020-05-09T19:23:08+05:30 IST
వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి కేంద్రానికి తృణమూల్ సర్కార్ సహకరించడం లేదంటూ
కోల్‌కత్తా : వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి కేంద్రానికి తృణమూల్ సర్కార్ సహకరించడం లేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపణలకు తృణమూల్ కాంగ్రెస్ క్షణాల్లో కౌంటర్ ఇచ్చింది. తాను చేసిన ఆరోపణలను వెంటనే నిరూపించాలని, లేదా అమిత్‌షా వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని తృణమూల్ యువనేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.చాలా రోజులుగా మౌనంగా ఉండిపోయిన అమిత్‌షా, ఇప్పుడు మాత్రం అబద్ధాల మీద అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు.
‘‘ఈ సంక్షోభ సమయంలో విధుల నిర్వహణలో కేంద్ర హోంమంత్రి ఫేయిల్ అయ్యారు. చాలా రోజులుగా మౌనంగా ఉండిపోయారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అబద్ధాల మీద అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వలసకార్వీకులను వారి కర్మానికి వదిలేస్తే..హోం మంత్రి ఇప్పుడు వలస కార్మికుల గురించి బాధపడుతున్నారు. ఆయన చేసిన ఆరోపణలను నిరూపించనైనా నిరూపించాలి లేదా తమకు క్షమాపణలైనా చెప్పాలి’’ అంటూ అభిజిత్ ట్విట్టర్ వేదికగా అమిత్‌షాను డిమాండ్ చేశారు.
లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి కేంద్రానికి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ అమిత్ షా ఆరోపించారు. దేశంలో 2 లక్షల మంది వలసకార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం సదుపాయం కల్పించిందని మంత్రి పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చిక్కుకు పోయిన వలసకార్మికులు కూడా వారి స్వస్థలాలకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారని, కాని పశ్చిమ బెంగాల్ సర్కారు వలసకార్మికులను తరలించేందుకు రైళ్లను అనుమతించడం లేదని అమిత్ షా ఆరోపించారు. దీని వల్ల వలసకార్మికులు మరింత అవస్థలు పడుతున్నారని కేంద్రమంత్రి సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.