వ్యాపారుల కోసం ఆరోగ్య సేతులో కొత్త ఫీచర్!

ABN , First Publish Date - 2020-08-23T05:18:18+05:30 IST

ఆర్థిక రంగం పట్టాలెక్కుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాపారాలు సాఫీగా సాగేందుకు ఆరోగ్య సేతు యాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

వ్యాపారుల కోసం ఆరోగ్య సేతులో కొత్త ఫీచర్!

న్యూఢిల్లీ: ఆర్థిక రంగం పట్టాలెక్కుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాపారాలు సాఫీగా సాగేందుకు ఆరోగ్య సేతు యాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను యాజమాన్యాలు తెలుసుకునేందుకు వీలుగా కొత్త ఓపెన్ ఏపీఐ ఫీచర్‌ను ఆరోగ్య సేతు యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కరోనా నిబంధనలు పాటిస్తూనే వ్యాపారాలు కొనసాగించే అవకాశం కలుగుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. కేవలం ఉద్యోగి పేరు, ఆరోగ్య స్థితి మాత్రమే ఈ ఫిచర్ ద్వారా తెలుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ వివరాలు పొందేందుకు ముందుగా ఉద్యోగుల అనుమతి కూడా పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 


Updated Date - 2020-08-23T05:18:18+05:30 IST