కేంద్ర ప్రభుత్వం పారిపోతోంది: భగవత్ మన్

ABN , First Publish Date - 2020-12-16T03:43:33+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమాద్మీ పార్టీ ఎంపీ భగవత్ మన్ తీవ్ర ఆగ్రహం...

కేంద్ర ప్రభుత్వం పారిపోతోంది: భగవత్ మన్

చండీగఢ్: పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమాద్మీ పార్టీ ఎంపీ భగవత్ మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న ‘‘రైతు వ్యతిరేక’’ వ్యవసాయ చట్టాలపై చర్చ నుంచి ‘‘పారిపోయేందుకు’’ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆయన ఆరోపించారు. రైతుల ప్రధాన సమస్యలు, ఆందోళలనపై పార్లమెంటులో చర్చించేది పోయి... కరోనా పేరుతో మోదీ ప్రభుత్వం ఏకంగా పార్లమెంటు సమావేశాలను రద్దు చేసిందంటూ మన్ మండిపడ్డారు. ‘‘కార్పొరేట్ సంస్థల లబ్ధి కోసం చట్టాలను ఆమోదించేందుకు కేంద్రం పత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. మరి అలాంటప్పుడు రైతు ఆందోళనపై చర్చించేందుకు అదే ప్రభుత్వం ఎందుకు శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదు..?’’ అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ‘‘పారిపోతూనే’’ ఉందని ఆయన అన్నారు. 

Updated Date - 2020-12-16T03:43:33+05:30 IST