నిరసన చేస్తున్న రైతులకు వైఫై సౌకర్యం కల్పించనున్న ఆప్

ABN , First Publish Date - 2020-12-29T23:32:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాలకు సంబంధించిన ప్రతుల్ని మొన్నామధ్య ఢిల్లీ అసెంబ్లీలో చించేసి వీటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని

నిరసన చేస్తున్న రైతులకు వైఫై సౌకర్యం కల్పించనున్న ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దులో ఒకటైన సింఘూ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులకు వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. నిరసనకారుల నుంచి వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైనన్ని వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆప్ పేర్కొంది. సింఘూ సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో 100 మీటర్ల దూరం చొప్పున వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నారట.


ఈ విషయమై పార్టీ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ రైతుబాంధవుడైన అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం మేరకు ప్రత్యేక వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ‘‘నిరసన చేస్తున్న రైతులు తమ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకోసం సింఘూ సరిహద్దులో కొన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని వైఫై హాట్‌స్పాట్‌లుగా మార్చబోతున్నాం. ఇది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చొరవ. ఆందోళనకారుల నుంచి డిమాండ్ పెరిగితే మరిన్ని వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తాం’’ అని రాఘవ్ చద్దా అన్నారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాలకు సంబంధించిన ప్రతుల్ని మొన్నామధ్య ఢిల్లీ అసెంబ్లీలో చించేసి వీటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న నిరసనకు తాను, తన పార్టీ బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కేంద్ర మంత్రికి నేను చాలెంజ్ చేస్తున్నాను. మీరు తెచ్చిన చట్టాలపై రైతులతో చర్చించండి. అవి ఎంత క్రూరమైన చట్టాలతో అర్థం అవుతుంది’’ అని ఓ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2020-12-29T23:32:32+05:30 IST