డిప్యూటీ సీఎం ఇంట్లోకి అమిత్ షా గూండాలను పంపారు: ఆప్

ABN , First Publish Date - 2020-12-11T00:32:57+05:30 IST

ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు బీజేపీ

డిప్యూటీ సీఎం ఇంట్లోకి అమిత్ షా గూండాలను పంపారు: ఆప్

న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు బీజేపీ కార్యకర్తలేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఇంటి బయట ప్రదర్శన నిర్వహిస్తూ ఇంట్లోకి చొరబడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆప్ నేత అతిషి మాట్లాడుతూ.. అమిత్‌షాపై విరుచుకుపడ్డారు. పోలీసుల రక్షణ మధ్య బీజేపీ గూండాలను డిప్యూటీ సీఎం ఇంట్లోకి షా పంపించారని ఆరోపించారు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఆమె షేర్ చేశారు. అందులో పోలీసులు చూస్తుండగానే ప్రదర్శనకారులు సిసోడియా ఇంట్లోకి ప్రవేశించడం స్పష్టంగా కనిపిస్తోంది.  

Updated Date - 2020-12-11T00:32:57+05:30 IST