వ్యవసాయ చట్టాలపై జంతర్‌మంతర్ వద్ద ఆప్ నిరసన

ABN , First Publish Date - 2020-10-12T23:29:45+05:30 IST

ఇటీవల ఆమోదం పొందిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ విభాగం..

వ్యవసాయ చట్టాలపై జంతర్‌మంతర్ వద్ద ఆప్ నిరసన

న్యూఢిల్లీ: ఇటీవల ఆమోదం పొందిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ విభాగం సోమవారంనాడు జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరిపింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పాల్గొన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ కేబినెట్ మంత్రి గోపాల్ రాయ్, పలువురు ఆప్ సీనియర్ నేతలు హాజరయ్యారు.


'రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన తెలిపేందుకు పంజాబ్ రైతులు జంతర్ మంతర్‌కు వచ్చారు. సరైన సంప్రదింపులు లేకుండా తీసుకువచ్చిన చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లు, సంక్షేమానికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిస్తోంది. నేను కూడా జంతర్ మంతర్ వెళ్తున్నాను, మీరు కూడా రండి' అంటూ కేజ్రీవాల్ ఇవాళ ఉదయం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-12T23:29:45+05:30 IST