అతి తీవ్రంగా ‘ఆంఫన్‌’

ABN , First Publish Date - 2020-05-18T08:28:48+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుపాను ఆదివారం బలపడింది. ఉదయానికి తీవ్ర తుపానుగా, సాయంత్రానికి అతితీవ్ర తుపానుగా మారింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారనుందని...

అతి తీవ్రంగా ‘ఆంఫన్‌’

  • పెను తుపానుగా మారే అవకాశం


అమరావతి/విశాఖపట్నం/న్యూఢిల్లీ, మే 17(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుపాను ఆదివారం బలపడింది. ఉదయానికి తీవ్ర తుపానుగా, సాయంత్రానికి అతితీవ్ర తుపానుగా మారింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా 20న పశ్చిమ బెంగాల్‌లో సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌లో హతియా దీవుల మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రలో ఆదివారం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి. సోమ, మంగళవారాల్లోనూ ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావంతో ఈనెల 19, 20న ఒడిశా తీరప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర పెనుగాలులతో పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా, రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు ఆదివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ప్రకటించింది. 


Updated Date - 2020-05-18T08:28:48+05:30 IST