నీటిలోనే ఇళ్లు.. రోడ్లు

ABN , First Publish Date - 2020-05-24T07:31:35+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ఆంఫన్‌ తుఫాను ప్రభావానికి మృతి చెందినవారి సంఖ్య 86కు చేరింది. సుమారు 6 జిల్లాలు అతలాకుతలమవడంతో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు అధికారులు నానాకష్టాలు...

నీటిలోనే ఇళ్లు.. రోడ్లు

  • అంధకారంలో అనేక ప్రాంతాలు
  • 86కు చేరిన ఆంఫన్‌ తుఫాను మృతులు

కోల్‌కతా, మే 23: పశ్చిమ బెంగాల్‌లో ఆంఫన్‌ తుఫాను ప్రభావానికి మృతి చెందినవారి సంఖ్య 86కు చేరింది. సుమారు 6 జిల్లాలు అతలాకుతలమవడంతో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు అధికారులు నానాకష్టాలు పడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 లక్షలకుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రత్యక్షంగా 1.5 కోట్ల మంది ప్రభావితులయ్యారు. రోడ్లు నీటమునిగాయి. విద్యుత్‌, మొబైల్‌ కనెక్షన్లను పునరుద్ధరించినప్పటికీ, ఇంకా అనేక ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్‌, నీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. కాగా, ప్రజలు సహనంతో ఉండాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించేందుకు అధికారులు నిరంతరాయంగా పనిచేస్తున్నారని చెప్పారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసరమైన మౌలిక వసతుల పునరుద్ధరణకు ఆర్మీ, రైల్వే, పోర్టుల సాయాన్ని ఆమె కోరారు.

Updated Date - 2020-05-24T07:31:35+05:30 IST