మోదీ ట్విటర్ ఖాతా పాస్‌వర్డ్ బయటపెట్టిన మహిళ

ABN , First Publish Date - 2020-03-08T20:30:03+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ఖాతాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మోదీ ట్విటర్ ఖాతా పాస్‌వర్డ్ బయటపెట్టిన మహిళ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ఖాతాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన ఏడుగురు మహిళలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్న నారీమణికి ఓ ట్విటరాటీ విన్నపంలాంటి సవాల్ విసిరారు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది. 


చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త స్నేహ మోహన్‌దాస్ ప్రధాని మోదీ ట్విటర్ ఖాతాను నిర్వహించారు. ఆమె ఇచ్చిన ట్వీట్‌లో కనీసం ఒక అవసరార్థికి ఆహారం పెట్టాలని ప్రజలను కోరారు. 


ఈ నేపథ్యంలో ధ్రువ్ సింగ్ @విక్రాంత్భడౌర్6 ఓ ట్వీట్ చేశారు. ‘‘దయచేసి పాస్‌వర్డ్ చెప్పండి’’ అని కోరారు. దీనికి మోదీ ట్విటర్ ఖాతా నుంచి స్నేహ బదులిచ్చారు.


‘‘న్యూ ఇండియా... లాగిన్ అవడానికి ప్రయత్నించండి’’ అని తెలిపారు. 


ఈ సరస సంభాషణతో కూడిన ట్వీట్లను నెటిజన్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక ట్విటర్ ఖాతాలో చూసి, ఆస్వాదిస్తూ, నవ్వుల్లో మునిగి తేలుతున్నారు. సమయస్ఫూర్తితో జవాబు ఇచ్చిన స్నేహను అభినందిస్తున్నారు. 


Updated Date - 2020-03-08T20:30:03+05:30 IST