రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2020-12-10T07:28:08+05:30 IST
రాజస్థాన్‌లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రె్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 9: రాజస్థాన్‌లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రె్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌లకు ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు.
మొత్తం 21 జిల్లాల్లోని 4,371 పంచాయతీ సమితీ స్థానాల్లో బీజేపీ 1,989 చోట్ల విజయం సాధించింది. కాంగ్రె్‌సకు 1,852 స్థానాలు దక్కాయి. ఇతరులు 439 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ 60, బీఎస్పీ 5, సీపీఎం 26 చోట్ల గెలుపొందాయి. మొత్తం 636 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, బీజేపీ 353 చోట్ల, కాంగ్రెస్ 252 కేంద్రాల్లో గెలుపొందాయి.