ఆక్సిజన్ ప్లగ్ పీకి వ్యక్తి చావుకు కారణమైన కుటుంబం.. కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2020-06-20T04:18:04+05:30 IST

వెంటిలేటర్‌పై ఉన్న ఓ 40 ఏళ్ల వ్యక్తి మరణానికి అతడి కుటుంబ సభ్యలే కారణమయ్యారు. శ్వాససంబంధ సమస్యతో ...

ఆక్సిజన్ ప్లగ్ పీకి వ్యక్తి చావుకు కారణమైన కుటుంబం.. కారణం తెలిస్తే..

జైపూర్: వెంటిలేటర్‌పై ఉన్న ఓ 40 ఏళ్ల వ్యక్తి మరణానికి అతడి కుటుంబ సభ్యలే కారణమయ్యారు. శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి  రాజస్థాన్‌లోని గవర్నమెంట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. వాతావరణం వేడిగా ఉండడంతో వారికి ఉక్కపోయసాగింది. దీంతో తమ వెంొట తెచ్చుకున్న కూలర్‌ ఆన్‌ చేసుకోవాలని అనుకున్నారు. దాని ప్లగ్ పెట్టేందుకు వెంటిలేటర్ ప్లగ్‌ను తీసేశారు. అరగంట తరువాత వెంటిలేటర్ పవర్ పూర్తిగా అయిపోవడంతో అది ఆగిపోయింది.

బాధితుడు నిర్జీవంగా పడిఉన్నాడు. దీంతో వెంటనే డాక్టర్ల, సిబ్బంది వచ్చి  సీపీఆర్‌తో పాటు పలు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అతడు మరణించినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని నియమించినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే అతడి కుటుంబ సభ్యులు మాత్రం విచారణలో తమకు సహకరించడం లేదని తెలిపారు.

Updated Date - 2020-06-20T04:18:04+05:30 IST