కోవిడ్ నుంచి బయటపడాలని నీరు తాగి ఆసుపత్రిపాలయ్యాడు

ABN , First Publish Date - 2020-12-30T16:16:44+05:30 IST

సురక్షిత నీరు తగిన మోతాదులో తాగడం వల్ల ఆరోగ్యాన్ని

కోవిడ్ నుంచి బయటపడాలని నీరు తాగి ఆసుపత్రిపాలయ్యాడు

లండన్ : సురక్షిత నీరు తగిన మోతాదులో తాగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మోతాదుకు మించి నీరు తాగితే శరీరంలోని సోడియం లెవెల్స్ తగ్గి, అనారోగ్యంపాలవుతారు. బ్రిస్టల్‌లోని పాచ్‌వేకు చెందిన ల్యూక్ విలియంసన్ తనకు కోవిడ్-19 సోకినట్లు అనుమానించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ ఆయనకు రోజూ రెండు లీటర్ల చొప్పున నీరు తాగాలని సలహా ఇచ్చారు. తొందరగా కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఆయన రోజుకు 5 లీటర్ల చొప్పున నీరు తాగారు. 


మోతాదుకు మించి నీరు తాగడంతో ల్యూక్ విలియంసన్ శరీరంలోని సోడియం లెవెల్స్ దారుణంగా తగ్గిపోయి, కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన భార్య లారా అప్రమత్తమై, అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆసుపత్రిలో ఆయనను మూడు రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుని, ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో హాయిగా గడుపుతున్నారు. 


ల్యూక్ విలియంసన్ భార్య లారా మాట్లాడుతూ, ల్యూక్  వారంపాటు చాలా నీరసంగా ఉన్నట్లు తెలిపారు. బాగా పళ్ల రసాలు తాగాలని డాక్టర్లు ఆయనకు చెప్పారన్నారు. ఓ రోజు రాత్రి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళారని, అక్కడి నుంచి పెద్ద చప్పుడు వినిపించిందని చెప్పారు. అక్కడే ఆయన కుప్పకూలిపోయారని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది చాలా మంచివారని తెలిపారు. ఆయనకు పరీక్షలు చేసి, ఆరోగ్యం కుదుటపడేలా చేశారన్నారు. 
Updated Date - 2020-12-30T16:16:44+05:30 IST