విగతజీవిగా పడి ఉన్న చిరుతపులి.. మెడపై బుల్లెట్ గాయం

ABN , First Publish Date - 2020-06-20T00:33:50+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సిమ్లా రూరల్‌లోని...

విగతజీవిగా పడి ఉన్న చిరుతపులి.. మెడపై బుల్లెట్ గాయం

హీరానగర్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సిమ్లా రూరల్‌లోని హీరానగర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి విగత జీవిగా పడి ఉన్నట్లు అటవీ శాఖ స్థానిక అధికారులు గుర్తించారు. చిరుతపులి కళేబరాన్ని పోస్ట్‌మార్టంకు తరలించగా మెడ మీదుగా బుల్లెట్ దూసుకెళ్లినట్లు తేలింది.


వేటగాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాన్ని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఘటనపై విచారణ ప్రారంభించారు. ఒడిశాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా వెలుగుచూసింది. ఓ ఏనుగును వేటగాళ్లు బుల్లెట్‌తో కాల్చడంతో మృతి చెందింది. ఇలా మూగజీవాలను పాశవికంగా చంపుతుండటంపై వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-06-20T00:33:50+05:30 IST