ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలికి కరోనా

ABN , First Publish Date - 2020-04-01T17:09:58+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు...

ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలికి కరోనా

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు  కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డారు. దీనితో డాక్టర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఢిల్లీ  స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న వైద్యురాలికి కోవిడ్ -19 పరీక్ష సానుకూలంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ఆ వైద్యురాలు ఇటీవల ఆమె సోదరుడి ఇంటిని సందర్శించారు. ఆయన కొన్ని రోజుల క్రితం యూకె నుండి తిరిగి వచ్చారు.  ఢిల్లీలో ఇప్పటివరకు 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యానని  సత్యేంద్ర జైన్ తెలిపారు. 

Updated Date - 2020-04-01T17:09:58+05:30 IST