కోవిడ్ నుంచి కోలుకున్న 98 ఏళ్ల మాజీ సైనికుడు
ABN , First Publish Date - 2020-08-16T23:02:43+05:30 IST
రాము లక్ష్మణ్ సక్క్‌పాల్ అనే మాజీ నేవీ సైనికుడు.. కొద్ది రోజుల క్రితం కోవిడ్-19 ప్రభావంతో ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్విని ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన సమయానికి ఆయన ఆరోగయ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు

న్యూఢిల్లీ: కోవిడ్-19 నుంచి 98 ఏళ్ల మాజీ సైనికుడు కోలుకున్నారు. కరోనా వైరస్ వల్ల తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన.. తిరిగి కోలుకోవడంపై కుటుంబ సభ్యులు, నేవీ బృందం హర్షం వ్యక్తం చేసింది.
రాము లక్ష్మణ్ సక్క్‌పాల్ అనే మాజీ నేవీ సైనికుడు.. కొద్ది రోజుల క్రితం కోవిడ్-19 ప్రభావంతో ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్విని ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన సమయానికి ఆయన ఆరోగయ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనాతో పాటు న్యూమోనియా కూడా ఉండడంతో క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు చికిత్స అందించాల్సి వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కాగా తాజాగా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడంతో ఇండియన్ నేవీ అధికారులు ఆసుపత్రి సిబ్బంది సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.