94 శాతం విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు లేవు

ABN , First Publish Date - 2020-08-18T07:32:00+05:30 IST

కరోనాతో ఇప్పటికే నష్టపోయిన విద్యా కాలాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీకి చెందిన బాలల హక్కుల సంస్థ సీఆర్‌వై ఇటీవల దక్షిణాది...

94 శాతం విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు లేవు

  • ఇంటర్నెట్‌ లేదు.. దక్షిణాదిలో ఆన్‌లైన్‌ పాఠాల తీరు


న్యూఢిల్లీ, ఆగస్టు 17: కరోనాతో ఇప్పటికే నష్టపోయిన విద్యా కాలాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీకి చెందిన బాలల హక్కుల సంస్థ సీఆర్‌వై ఇటీవల దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జూన్‌- మే నెలల్లో 11-18 ఏళ్ల మధ్య వయసున్న 5,987 మంది విద్యార్థులను టెలిఫోన్‌ ద్వారా సర్వే చేశారు. కర్ణాటకలో 9శాతం, తమిళనాడులో 3శాతం విద్యార్థులే స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారు. 4 రాష్ట్రాల్లో 94శాతం విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు కానీ, ఇంటర్నెట్‌ సౌకర్యం కానీ లేదు. 6శాతం విద్యార్థులే సొంత స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉండగా, 29శాతం కుటుంబ సభ్యుల ఫోన్లపై ఆధారపడుతున్నారు.  


Updated Date - 2020-08-18T07:32:00+05:30 IST