కరోనాను జయించిన 93 ఏళ్ల బామ్మ.. ఎక్కడంటే?
ABN , First Publish Date - 2020-05-14T04:38:04+05:30 IST
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది.

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ 93ఏళ్ల బామ్మ కరోనాపై గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. ముంబైలోని మాజ్‌గావ్‌కు చందిన సదరు బామ్మ కరోనాతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. తను కోలుకోవడానికి నమ్మకం, ఆత్మబలమే కారణమని ఆ వృద్ధురాలు చెప్పింది. తనకు చికిత్సనందించిన వైద్యబృందానికి ధన్యవాదాలు తెలిపింది.