పశ్చిమ బెంగాల్‌లో 9 నెలల పసికందుకు కరోనా.. ఆ కుటుంబంలోని మరో నలుకురికీ పాజిటివ్

ABN , First Publish Date - 2020-03-28T20:39:52+05:30 IST

దేశంలో నానాటికీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు...

పశ్చిమ బెంగాల్‌లో 9 నెలల పసికందుకు కరోనా.. ఆ కుటుంబంలోని మరో నలుకురికీ పాజిటివ్

పశ్చిమ బెంగాల్: దేశంలో నానాటికీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి. అయినా కరోనా ధాటిని అరికట్టడంలో సఫలీకృతం కాలేకపోతున్నాయి. 


ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమ బెంగాల్‌లో 9 నెలల పసికందు కరోనా బారిన పడడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారి ధృవీకరించారు. అంతేకాకుండా ఆ కుటుంబంలోని మిగిలిన నలుగురికి కూడా కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆ అధికారి వెల్లడించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని వివరించారు. 


ఒకేసారి 5 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 15కు పెరిగిందని వైద్యాధికారి తెలిపారు.

Updated Date - 2020-03-28T20:39:52+05:30 IST