గ్రేటర్ ముంబైలో 875 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-11T01:50:25+05:30 IST

కరోనా కారణంగా దేశంలోనే అత్యంత దారుణంగా నష్టపోతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మారింది. దీనికి ముఖ్య కారణంగా...

గ్రేటర్ ముంబైలో 875 కరోనా కేసులు

ముంబై: కరోనా కారణంగా దేశంలోనే అత్యంత దారుణంగా నష్టపోతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మారింది. దీనికి ముఖ్య కారణంగా రాష్ట్ర రాజధాని ముంబై నిలుస్తోంది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలకంటే ఒక్క ముంబైలో నమోదయ్యే కేసులే ఎక్కువగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా గ్రేటర్ ముంబై పరిధిలో దాదాపు 800కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదల చేశారు. దాని ప్రకారం..


24 గంటల వ్యవధిలో 875 కరోనా కేసులు గ్రేటర్ పరిధిలో నమోదయ్యాయి. 19 మంది మరణించారు. 212 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 13,564కు చేరింది. 508 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 3,004 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Updated Date - 2020-05-11T01:50:25+05:30 IST