కరోనా రిపోర్ట్: తమిళనాడులో కొత్తగా 856 కేసులు

ABN , First Publish Date - 2020-05-31T00:49:51+05:30 IST

తమిళనాడులో 856 కరోనా పాజిటివ్ కేసులను కొత్తగా గుర్తించినట్లు రాష్ట్ర ప్ఱభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ నుంచి...

కరోనా రిపోర్ట్: తమిళనాడులో కొత్తగా 856 కేసులు

చెన్నై: తమిళనాడులో 856 కరోనా పాజిటివ్ కేసులను కొత్తగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ నుంచి ఓ నివేదిక విడుదలైంది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 856 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. 687 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,184కు చేరింది. వీరిలో 12,000మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 9,021 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 160 మరణాలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-05-31T00:49:51+05:30 IST