8 కోట్ల మంది వలస కూలీలకు ఉచిత రేషన్
ABN , First Publish Date - 2020-05-17T07:35:20+05:30 IST
కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి.. వందల కొద్దీ కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న ఉపాధి కూలీలకు ఉచి తంగా రేషన్ సరుకులు ఇవ్వాలని...

- 15 రోజుల్లోగా పంపిణీ చేయాలి..
- రాష్ట్ర ప్రభుత్వాలకు పాసవాన్ సూచన
న్యూఢిల్లీ, మే 16: కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి.. వందల కొద్దీ కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న ఉపాధి కూలీలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాంవిలాస్ పాసవాన్ కోరారు. గోదాముల నుంచి ఆహార పదార్థా లు, పప్పు ధాన్యాలను వెంటనే తీసుకోవాల్సిందిగా సూచించారు. రేషన్ కార్డులేని 8 కోట్ల మంది వలస కూలీలకు 15 రోజుల్లోగా వీటిని పంపిణీ చేయాలన్నారు. లబ్ధిదారుల్లో యూపీకి చెందిన 1.42 కోట్ల మంది, బిహార్ (86.45 లక్షలు), మహారాష్ట్ర(70 లక్షలు), పశ్చిమబెంగాల్(60.1 లక్షలు), మధ్యప్రదేశ్(54.64 లక్షలు), రాజస్థాన్(44.66 లక్షలు), కర్ణాటక(40.19 లక్షలు), గుజరాత్(38.25 లక్షలు), తమిళ నాడు(35.73 లక్షలు), జార్ఖండ్(26.37 లక్షలు), ఏపీ(26.82 లక్షలు) ఉంటారు.