75 శాతం మంది కరోనా బాధితుల్లో లక్షణాలు లేవు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-05-10T23:12:58+05:30 IST

ఢిల్లీలోని మొత్తం కోవిడ్ బాధితుల్లో దాదాపు 75 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవని (అసింప్టమాటిక్) అని

75 శాతం మంది కరోనా బాధితుల్లో లక్షణాలు లేవు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మొత్తం కోవిడ్ బాధితుల్లో దాదాపు 75 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవని (అసింప్టమాటిక్) అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కోవిడ్-19తో కలిసి జీవించడం ఢిల్లీ ప్రజలు నేర్చుకోవాలని అన్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన ప్రతి ఒక్కరు కేంద్రం సవరించిన మార్గదర్శకాలను పాటించాలని, అందరూ విధిగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 


ఢిల్లీలో ఇప్పటి వరకు 6,923 కరోనా కేసులు నమోయ్యాయి. వీరిలో 2,069 మంది కోలుకోగా, 73 మంది మరణించినట్టు వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ తెలిపారు. 6,923 మంది కోవిడ్ రోగుల్లో 1,476 మంది మాత్రమే ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. మిగతా 75 శాతం మంది వారి ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. వారంతా ప్రతి రోజూ ప్రొటోకాల్ పాటించేలా తమ బృందాలు ప్రతి రోజూ వారి ఇళ్లను సందర్శిస్తున్నట్టు వివరించారు. ఇళ్లలో ప్రత్యేక గదులు, టాయిలెట్లు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రభుత్వం చేరుస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-05-10T23:12:58+05:30 IST