ఆ 5 నగరాల్లో 70 అంతస్థుల భవనాలు!

ABN , First Publish Date - 2020-08-18T21:39:03+05:30 IST

రాష్ట్రంలోని అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, గాంధీనగర్ నగరాల్లో వీటిని నిర్మించనున్నారు. 70కి పైగా అంతస్తులతో ఒక్కో భవనాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది

ఆ 5 నగరాల్లో 70 అంతస్థుల భవనాలు!

గాంధీనగర్: గుజరాత్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో ఆకాశ హర్మ్యాలు నిర్మించేందుకు స్థానిక ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపారు. నానాటికీ పెరుగుతున్న జనాభాకు సరిపడా తక్కువ స్థలంలో ఎక్కువ మందికి నివాసయోగ్యమైనట్లుగా వర్టికల్ పద్దతిలో భారీ భవనాలను నిర్మించనున్నట్లు సీఎంవో పేర్కొన్నారు.


రాష్ట్రంలోని అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, గాంధీనగర్ నగరాల్లో వీటిని నిర్మించనున్నారు. 70కి పైగా అంతస్తులతో ఒక్కో భవనాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీనికి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం పచ్చ జెండా ఊపినట్లు.. తొందరలోనే పనులు ప్రారంభం కాబోతున్నట్లు సీఎంవో చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-08-18T21:39:03+05:30 IST