70మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్?.. పోలీసుల సాయం కోరిన అధికారులు!

ABN , First Publish Date - 2020-06-24T02:57:28+05:30 IST

దేశంలో కరోనా భూతం కరాళ నృత్యం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.

70మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్?.. పోలీసుల సాయం కోరిన అధికారులు!

ముంబై: దేశంలో కరోనా భూతం కరాళ నృత్యం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన 70మంది కరోనా పేషెంట్లు కనిపించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ఉ(బీఎంసీ) అధికారులు తెలిపారు. వీరిని మిస్సింగ్ కేసులుగా చూపుతూ పోలీసుల సాయం కోరారు. వీరు మూడు నెలలుగా కనిపించడంలేదని అధికారులు చెప్పారు. వీరంతా కరోనా పాజిటివ్ అని తేలిందని, అయితే వారు ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసినా, అడ్రస్‌కు వెళ్లినా సదరు వ్యక్తులను ట్రేస్ చేయలేకపోయామని బీఎంసీ అధికారులు వెల్లడించారు. వీళ్ల వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్న అధికారులు.. ఈ మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడం కోసం పోలీసుల సాయం తీసుకుంటున్నారు.

Read more