తమిళనాడును పీడిస్తున్న తబ్లీగీ కష్టాలు

ABN , First Publish Date - 2020-04-08T00:25:02+05:30 IST

తమిళనాడును తబ్లీగీ జమాత్ కష్టాలు వీడడం లేదు. ప్రతి రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో సింహభాగం ఢిల్లీలో..

తమిళనాడును పీడిస్తున్న తబ్లీగీ కష్టాలు

చెన్నై: తమిళనాడును తబ్లీగీ జమాత్ కష్టాలు వీడడం లేదు. ప్రతి రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో సింహభాగం ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనవారు కావడమే దీనికి కారణం. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ స్పష్టం చేశారు. ఈ రోజు కొత్తగా 69 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించామని, అయితే వారిలో 63 మంది దేశ రాజధానిలోని మర్కజ్ మజీదులో నిర్వహించిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారేనని ఆమె తెలిపారు. 

ఇదిలా ఉంటే ఇప్పటివరకు 690 కేసులు నమోదయ్యాయని, అయితే వాటిలో 636 కేసులు మర్కజ్ కార్యక్రమానికి హాజరైనవారేనని బీలా రాజేశ్ వెల్లడించారు. 

Read more