ఢిల్లీలో రూ.685 కోట్ల జీఎస్టీ కుంభకోణం

ABN , First Publish Date - 2020-11-13T08:50:55+05:30 IST

షెల్‌ కంపెనీలు, నకిలీ ఇన్వాయి్‌సలు, వేబిల్లులతో రూ. 685 కోట్ల మేర జీఎస్టీ కుంభకోణానికి పాల్పడ ఉదంతమిది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది...

ఢిల్లీలో రూ.685 కోట్ల జీఎస్టీ కుంభకోణం

న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): షెల్‌ కంపెనీలు, నకిలీ ఇన్వాయి్‌సలు, వేబిల్లులతో రూ. 685 కోట్ల మేర జీఎస్టీ కుంభకోణానికి పాల్పడ ఉదంతమిది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జీఎస్టీ సౌత్‌ కమిషనరేట్‌ వర్గాల కథనం ప్రకారం.. ఈ-వే పోర్టల్‌, జీఎస్టీఎన్‌ పోర్టల్‌లో లభించే డేటా, సమాచారం ఆధారంగా జీఎస్టీ తప్పుడు క్లెయిమ్‌లు జరిగినట్లు గుర్తించిన అధికారులు.. న్యూఢిల్లీలోని మహిపాల్పూర్‌, గంగా టవర్‌, ఎల్‌-10లో ఉన్న ‘బాన్‌ గంగా ఇంపెక్స్‌ కంపెనీ’పై అధికారులు దాడులు నిర్వహించారు. ఉనికిలో లేని 48 షెల్‌ కంపెనీల నుంచి ఇన్వాయి్‌సలను సృష్టించి, భారీ మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. షెల్‌ కంపెనీల పేర్లతో ఐటీసీలను బాన్‌గంగా ఇంపెక్స్‌ కంపెనీకి బదిలీ చేసి, ఐజీఎస్టీ క్లెయిమ్‌లు చేసినట్లు నిర్ధారించారు. ఈ-వే బిల్లుల తయారీకి నకిలీ వాహనాల నంబర్లను సృష్టించారు. ఆయా నంబర్లను పరిశీలిస్తే.. అవి ట్రక్కులవి కానేకాదని అధికారులు నిగ్గుతేల్చారు. రూ. 685 కోట్లకు ఇన్వాయి్‌సలను, అందుకు సంబంధించి రూ.50 కోట్ల మేర జీఎస్టీ నకిలీ బిల్లులను సృష్టించి.. రూ.35 కోట్ల రిఫండ్‌ పొందారని అధికారులు తెలిపారు. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి, బాన్‌ గంగా ఇంపెక్స్‌ భాగస్వామి రాకేశ్‌ శర్మను ఈ నెల 9న అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-11-13T08:50:55+05:30 IST