తమిళనాడులో తగ్గని కరోనా.. ఆదివారం కొత్తగా 639 పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-05-18T00:22:08+05:30 IST

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా...

తమిళనాడులో తగ్గని కరోనా.. ఆదివారం కొత్తగా 639 పాజిటివ్ కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 639 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,224కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 6971. ఆదివారం తమిళనాడులో కరోనా సోకిన వారిలో కొత్తగా నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో.. తమిళనాడులో మరణాల సంఖ్య 78కి చేరింది.


ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్లలో, ఇతర రవాణా మార్గాల్లో తమిళనాడుకు వెళ్లిన వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్న పరిస్థితి ఉంది. ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్ర నుంచి తమిళనాడు వెళ్లిన వారిలో 73 మంది, కర్ణాటక నుంచి వెళ్లిన వారిలో ఇద్దరికి, రాజస్థాన్ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి తమిళనాడు వెళ్లిన వారిలో ముగ్గురికి, ఏపీ నుంచి వెళ్లిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తేల్చారు.

Updated Date - 2020-05-18T00:22:08+05:30 IST