సీఆర్‌పీఎఫ్‌లో మరో 67 మందికి కరోనా..

ABN , First Publish Date - 2020-05-10T02:51:04+05:30 IST

దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)లో..

సీఆర్‌పీఎఫ్‌లో మరో 67 మందికి కరోనా..

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా మహమ్మారి కలవరం రేపుతోంది. ఇవాళ మరో 62 మంది జవాన్లకు కొవిడ్-19 పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. ఈ కేసులన్నీ ఢిల్లీకి చెందిన ఒకే యూనిట్‌లో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది సంఖ్య 231కి చేరింది. ఇప్పటి వరకు ఇద్దరు జవాన్లు ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఓ జవాను మృతి చెందారు.


కాగా తాజా కేసులన్నీ సీఆర్‌పీఎఫ్‌లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) 194వ బెటాలియన్‌లోనే ఉన్నట్టు  అధికారులు వెల్లడించారు. వీరికి బవానాలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ 31వ బెటాలియన్‌లో 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందర్నీ మండోలిలోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత నెలలో 55 ఏళ్ల ఓ సీఆర్‌పీఎఫ్ అధికారి మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-05-10T02:51:04+05:30 IST