పంజాబ్‌లో కొత్తగా మరో 61 కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2020-05-11T00:59:43+05:30 IST

పంజాబ్‌లో ఆదివారంనాడు కొత్తగా 61 కోరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,823కు చేరినట్టు ..

పంజాబ్‌లో కొత్తగా మరో 61 కోవిడ్ కేసులు

ఛండీగఢ్: పంజాబ్‌లో ఆదివారంనాడు కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,823కు చేరినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 1,626 యాక్టివ్ కేసులు ఉండగా, మృతుల సంఖ్య 31కి చేరింది.


కాగా, దేశంలో మొత్తం 62,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 41,472గా ఉంది. 19,357 మందికి పూర్తి స్వస్థత చేకూరడంతో డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 2,109కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారంనాడు ప్రకటించింది.


కరోనా బాధిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ వరుస క్రమంలో ఉన్నాయి. మహారాష్ట్రలో 20,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుజరాత్‌లో 7,796, ఢిల్లీలో 6,542, తమిళనాడులో 6,535, రాజస్థాన్‌లో 3,708 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-05-11T00:59:43+05:30 IST