560 వలస కూలీలకు కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-17T21:20:15+05:30 IST

వివిధ రాష్ట్రాల నుంచి ఈనెల 16వ తేదీ వరకూ బీహార్‌కు చేరుకున్న 10,385 వలస కార్మికుల్లో 560కి కరోనా పాజిటివ్ ఉన్నట్టు ..

560 వలస కూలీలకు కోవిడ్ పాజిటివ్

పాట్నా: వివిధ రాష్ట్రాల నుంచి ఈనెల 16వ తేదీ వరకూ బీహార్‌కు చేరుకున్న 10,385 వలస కార్మికుల్లో 560కి కరోనా పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఈ వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కార్మికులందరినీ క్వారంటైన్‌కు పంపినట్టు తెలిపింది.


'రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల పట్ల బీహార్ ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శనివారం వరకూ వలస కార్మికుల డాటాను షేరింగ్ చేస్తున్నాం. వారందర్నీ క్వారంటైన్ సెంటర్లలో ఉంచాం'  అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంతవరకూ రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికుల్లో 560 పాజిటివ్ కేసులు ఉండగా, వీరిలో 172 మంది ఢిల్లీ నుంచి, 123 మంది మహారాష్ట్ర నుంచి, 26 మంది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్టు పేర్కొంది. 2,746 మంది శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉన్నట్టు తెలిపింది.

Updated Date - 2020-05-17T21:20:15+05:30 IST