తెలంగాణలో 55 రకాల కరోనాలు

ABN , First Publish Date - 2020-06-04T07:54:24+05:30 IST

దేశంలో 198 రకాల కరోనా వైర్‌సలను గుర్తించినట్లు జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎ్‌సఐ) ప్రకటించింది. కొవిడ్‌-19కు చెందిన 400 జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది...

తెలంగాణలో 55 రకాల కరోనాలు

కోల్‌కతా, జూన్‌ 3 : దేశంలో 198 రకాల కరోనా వైర్‌సలను గుర్తించినట్లు జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎ్‌సఐ) ప్రకటించింది. కొవిడ్‌-19కు చెందిన 400 జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన భారత్‌లోకి ప్రవేశించాక లేదా అంతకంటే ముందే వైర్‌సలో 198 రకాల జన్యుమార్పులు జరిగాయని స్పష్టం చేసింది. కరోనా అత్యధిక జన్యుమార్పులకు గురైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, అక్కడ 55 రకాల కొవిడ్‌ వైర్‌సలను గుర్తించినట్లు వెల్లడించింది.


గుజరాత్‌లోని ఒక్క అహ్మదాబాద్‌లోనే 60 రకాల కరోనాలు వ్యాపిస్తుండగా, గాంధీనగర్‌లో మరో 13 రకాల వైర్‌సలు ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని తేలడం గమనార్హం. ఇక ఢిల్లీలో 39 రకాలు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో చెరో 15 రకాల కరోనాలు ప్రబలుతున్నాయని జెడ్‌ఎ్‌సఐకి చెందిన సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ టాక్సానమీ శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో గుర్తించిన 198 రకాల కరోనా వైర్‌సలలో చైనా, ఐరోపా దేశాల నుంచి వ్యాపించిన రెండు రకాల కరోనా వైర్‌సల వల్లే ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇరాన్‌, దుబాయ్‌ దేశాల్లో వ్యాపిస్తున్న రకం కరోనాల ప్రభావం భారత్‌లో చాలా తక్కువగా ఉందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఈ అధ్యయన నివేదిక దోహదపడుతుందన్నారు.


Updated Date - 2020-06-04T07:54:24+05:30 IST