తమిళనాడులో కొత్తగా 500లకు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-19T01:08:13+05:30 IST

తమిళనాడులో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు...

తమిళనాడులో కొత్తగా 500లకు పైగా కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక్కరోజే 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 234 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 11,760కి చేరింది. 81 మంది మరణించారు. 4,406 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 7,270 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల్లో 46 మంది మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చినవారున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Updated Date - 2020-05-19T01:08:13+05:30 IST