తమిళనాడులో మరో 526 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-10T08:37:56+05:30 IST

తమిళనాడులో శనివారం 526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో చెన్నైలోనే 279 ఉన్నాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 6,535కు, చెన్నైలో...

తమిళనాడులో మరో 526 మందికి పాజిటివ్‌

చెన్నై, బెంగళూరు, మే 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో శనివారం 526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   వీటిలో చెన్నైలోనే 279 ఉన్నాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 6,535కు, చెన్నైలో 3,330కు చేరాయి. తాజాగా నలుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 44కి పెరిగింది. మొత్తం కేసుల్లో 1,867కు పైగా కోయంబేడు క్లస్టర్‌ వల్లే నమోదైనట్లు  ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 107 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కర్ణాటకలో  శనివారం మరో 41 మందికి సోకింది. బెంగళూరులో  12 మంది వైరస్‌కు గురయ్యారు. నగరంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాదరాయనపురలో 6వేల మందికి పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో 794 మందికి వ్యాధి ప్రబలగా 30 మంది మృతి చెందారు.  


Updated Date - 2020-05-10T08:37:56+05:30 IST