తమిళనాడులో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 526 కేసులు
ABN , First Publish Date - 2020-05-10T01:20:47+05:30 IST
తమిళనాడులో కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కరోనా హాట్‌స్పాట్ వెలుగులోకొచ్చిన...
చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కరోనా హాట్‌స్పాట్ వెలుగులోకొచ్చిన కొయంబత్తూరు మార్కెట్ నుంచి భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా 500కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 526 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు.
ఈ కేసులతో కలుపుకొని మొత్తం 6,535 కేసులను గుర్తించామని, 44 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ఈ కేసుల్లో 1,867 కేసులు కోయంబత్తూరు మార్కెట్‌కు సంబంధించినవేనని తెలిపింది. కాగా ఇంకా 4,664 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది.
