పీఎఫ్‌ చెల్లింపులకు 5 వేల కోట్లు

ABN , First Publish Date - 2020-04-21T09:41:57+05:30 IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపనల్లో భాగంగా 3 నెలల పాటు ఉద్యోగుల భవిష్య నిధి

పీఎఫ్‌ చెల్లింపులకు 5 వేల కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20:  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపనల్లో భాగంగా 3 నెలల పాటు ఉద్యోగుల భవిష్య నిధి మొత్తం జమకు రూ.5 వేల కోట్లు అవసరమని ఈపీఎ్‌ఫవో అంచనా వేసింది. రూ.15 వేల లోపు వేతన జీవులకు ఈ నిర్ణయం ఊరట కల్పించనుంది. ఈ కేటగిరీలో 4లక్షల సంస్థలు, 80లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు ఈపీఎ్‌ఫవో గుర్తించింది.


ఉద్యోగులు, సంస్థలు/వాణిజ్య సముదాయాలు/కంపెనీల పీఎఫ్‌ వాటాలను(చెరో 12% చొప్పున 24%) కేంద్రమే చెల్లించనుంది. కాగా, 6 లక్షల సంస్థలు తమ ఉద్యోగులకు సంబంధించిన మార్చి నెల పీఎఫ్‌ మొత్తా న్ని జమచేయడానికి మే 15 వరకు గడువు ఇచ్చింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన/వేతనాలు రాని ఖాతాదారులకు భవిష్య నిధి నుంచి 3 నెలల మూల వేతనం+డీఏ లేదా.. పీఎఫ్‌ జమలోంచి 75%.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే చాన్స్‌ ఇచ్చింది. 

Updated Date - 2020-04-21T09:41:57+05:30 IST