50 శాతం కరోనా బాధితులు తబ్లీగీ జమాత్‌కు హాజరైనవారే..

ABN , First Publish Date - 2020-04-06T02:26:54+05:30 IST

రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 50 శాతం మంది తబ్లీగీ జమాత్‌కు...

50 శాతం కరోనా బాధితులు తబ్లీగీ జమాత్‌కు హాజరైనవారే..

లక్నో: రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 50 శాతం తబ్లీగీ జమాత్‌ ద్వారా వ్యాప్తి చెందినవేనని లక్నో ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 278 కరోనా కేసులు నమోదయ్యాయని, వాటిలో 138 కేసులు మర్కజ్ మసీదులో జరిగిన తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనవారేనని వివరించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కారణంగా ముగ్గురు మరణించారని, 21 మంది కోలుకోవడంతో వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-04-06T02:26:54+05:30 IST