మానవ ప్రయోగాలకు ఐదు కరోనా వ్యాక్సిన్లు: ఐసీఎమ్‌ఆర్
ABN , First Publish Date - 2020-04-22T03:41:32+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి సైన్స్ చాలా వేగంగా ప్రతిస్పందించిందని ఐసీఎమ్‌ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అంటోంది.

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి సైన్స్ చాలా వేగంగా ప్రతిస్పందించిందని ఐసీఎమ్‌ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అంటోంది. ఈ మేరకు ఐసీఎమ్‌ఆర్ ప్రతినిధి ఆర్ గంగాఖేడ్కర్ మీడియాతో మంగళవారం మాట్లాడారు. ‘కరోనా వైరస్ అనేది ఓ కొత్తరకం వ్యాధి. దీన్ని నియంత్రించడం కోసం కేవలం మూడున్నర నెలల్లోనే సైన్స్ రంగం పురోగతి సాధించింది’ అని ఆయన తెలిపారు. కరోనాను ఓడించడానికి మొత్తం 70 రకాల వ్యాక్సిన్లు తయారు చేస్తున్నామని, వాటిలో ఐదింటిని మానవ ప్రయోగాల కోసం పంపామని వెల్లడించారు. ఇలా గతంలో ఏ వ్యాధి విషయంలోనూ జరగలేదని ఖేడ్కర్ స్పష్టంచేశారు.