అపహరించిన పౌరుల్ని తిరిగి అప్పగించనున్న చైనా ఆర్మీ
ABN , First Publish Date - 2020-09-12T14:57:35+05:30 IST
అపహరించిన ఐదుగురు భారతీయుల్ని చైనా ఆర్మీ శనివారం తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఈ విషయాన్ని

న్యూఢిల్లీ : అపహరించిన ఐదుగురు భారతీయుల్ని చైనా ఆర్మీ శనివారం తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. నిర్దేశించిన ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు చైనా ఆర్మీ ఆ యువకులను భారత దళాలకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. కిబితూ సరిహద్దుల్లో ఉన్న వాఛా ప్రదేశం దగ్గర భారత దళాలకు యువకులను అప్పగిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను సెప్టెంబర్ నాలుగో తేదీన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు అపహరించారు. అప్పర్ సుబన్ సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ దీనిపై పీఎంవోకు ఫిర్యాదు చేశారు.